Annamayya: అన్నమయ్య జిల్లాలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ – 28 వాహనాలు సీజ్

Annamayya: అన్నమయ్య జిల్లా అంగళ్లు ప్రాంతంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించిన పోలీసులు. 28 వాహనాలు స్వాధీనం, డ్రోన్లతో నిఘా.

Srinivasulu, Madanapalle
Published on: 8 Aug 2026 8:35 PM IST
Annamayya
X

Annamayya: అన్నమయ్య జిల్లాలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ – 28 వాహనాలు సీజ్

అన్నమయ్య జిల్లా: డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు నేతృత్వంలో శనివారం తెల్లవారుజామున అంగళ్లు ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

మిట్స్, విశ్వం ఇంజనీరింగ్ కళాశాలల పరిసరాల్లోని పీజీ హాస్టళ్లు, అద్దె ఇళ్లలో 105 మంది పోలీసు సిబ్బందితో ముమ్మర తనిఖీలు చేపట్టారు. డ్రోన్ కెమెరాల ద్వారా గగనతల నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను కలిపి మొత్తం 28 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనుమానితులకు నిర్వహించిన 53 డ్రగ్స్ పరీక్షల్లో అన్ని నెగిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యువత, స్థానికులతో కలిసి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, డ్రగ్స్ నిర్మూలనకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం పోలీసు శాఖ నిరంతరం చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐలు, ఎస్‌ఐలు, ఈగల్ టీమ్ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story