Annamayya: నాసిరకం విత్తనాలు, పురుగుమందుల అమ్మకాలను అరికట్టాలి: వంగిమళ్ళ రంగారెడ్డి
Annamayya: అన్నమయ్య జిల్లాలో నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుమందుల విక్రయాలపై ఏపీ రైతు సంఘం ఆగ్రహం.
Annamayya: నాసిరకం విత్తనాలు, పురుగుమందుల అమ్మకాలను అరికట్టాలి: వంగిమళ్ళ రంగారెడ్డి
Annamayya: అన్నమయ్య జిల్లాలోని పలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాల్లో నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుమందులు విక్రయిస్తున్నారనే రైతుల ఫిర్యాదులు పెరుగుతున్నాయని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ళ రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మదనపల్లి స్థానిక రైతు సంఘం కార్యాలయంలో రైతు సంఘం నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని ఫర్టిలైజర్స్ షాపులపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించి, నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుమందులు, గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు సంబంధించి ప్రతి దుకాణం తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని కోరారు.
రసీదు లేకపోవడం వల్ల నష్టపోయిన రైతులు ఫిర్యాదు చేసే అవకాశం కోల్పోతున్నారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నకిలీ ఉత్పత్తుల విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, రైతులను మోసం చేసే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వంగిమళ్ళ రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
నకిలీ విత్తనాలు, మందుల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి హరి, రైతు సంఘం నాయకులు శ్రీనివాసులు, ఆనంద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.




