Chittoor: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి: కోర్ కమిటీ డిమాండ్!

Chittoor: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ రాష్ట్ర రజక ఎస్సీ సాధన కోర్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ నెల 31న అన్ని కలెక్టరేట్లలో వినతిపత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించింది.

Chandra Sekhar, Chittoor
Published on: 27 Aug 2026 7:49 PM IST
Chittoor
X

Chittoor: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి: కోర్ కమిటీ డిమాండ్!

చిత్తూరు: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఏపీ రాష్ట్ర రజక ఎస్సీ సాధన కోర్ కమిటీ సభ్యుడు,చిత్తూరు సహకార టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి. షణ్ముగం డిమాండ్ చేశారు.గురువారం చిత్తూరులోని బి సి కార్యాలయంలో కోర్ కమిటీ కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్యతో కలిసి ఆయన తెలిపారు.

రాష్ట్రంలో 27 లక్షలకు పైగా ఉన్న రజకుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.2009 నుంచి ఇప్పటివరకు ఎనిమిది రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని తెలిపారు.

వచ్చే నెల 6న విజయనగరం జిల్లాలో జరిగే 9వ రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు.ఈ నెల 31న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని వెల్లడించారు.ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు సోమశేఖర్, రమేష్ బాబు, అర్జున్ కుమార్, వెంకటేష్ పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story