Chittoor: మానసిక ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు!

Chittoor: చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఒత్తిడిని అధిగమించడంపై నిపుణుల అవగాహన.

Chandra Sekhar, Chittoor
Published on: 8 Oct 2026 3:53 PM IST
Chittoor
X

Chittoor: మానసిక ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు!

Chittoor: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ది అపోలో యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్లినికల్‌ సైకాలజీ, అపోలో వెల్‌బీయింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డా. నితిన్‌ ఎం. నాగర్కర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలపై అవగాహన అవసరమన్నారు.

సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి అమరదీపానంద మహారాజ్‌ మాట్లాడుతూ.. మైండ్‌ఫుల్‌నెస్‌ ద్వారా ఏకాగ్రత, ఆత్మపరిశీలన, భావోద్వేగ నియంత్రణ పెంపొందుతాయని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, సవాళ్లను ప్రశాంతంగా ఎదుర్కొనే మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు.

సానుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, కరుణ, సహానుభూతితో సమతుల్య జీవనశైలిని అలవర్చుకోవచ్చని వివరించారు.కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ అనిల్‌ కుమార్‌ ఎస్‌, స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రమేష్‌ ఎస్‌.వీ., ప్రొఫెసర్‌ కె. భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor