Chittoor: పరిశోధనలో AIని బాధ్యతాయుతంగా వాడాలి: అపోలో వర్సిటీ VC!

Chittoor: పరిశోధన, వ్యాస రచనలలో AIని నైతికంగా, బాధ్యతాయుతంగా వాడాలని అపోలో యూనివర్సిటీ VC నాగర్కర్ అన్నారు. చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీలో వర్క్‌షాప్ జరిగింది.

Chandra Sekhar, Chittoor
Published on: 22 July 2026 2:47 PM IST
Chittoor
X

Chittoor: పరిశోధనలో AIని బాధ్యతాయుతంగా వాడాలి: అపోలో వర్సిటీ VC!

చిత్తూరు: పరిశోధనలో ఎఐ వినియోగం బాధ్యతాయుతంగా ఉండాలి: అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. నితిన్ ఎం. నాగర్కర్

పరిశోధనలో కృత్రిమ మేధ (ఎఐ) వినియోగాన్ని బాధ్యతాయుతంగా, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాల్సిన అవసరం ఉందని అపోలో యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డా. నితిన్ ఎం. నాగర్కర్ అన్నారు.

అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లోని ఫ్యాకల్టీ రీసెర్చ్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 'పరిశోధన, శాస్త్రీయ వ్యాస రచనలో ఎఐ వినియోగం' అంశంపై ఒకరోజు వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశోధన, వైద్య రంగాల్లో ఎఐ వినియోగం వేగంగా విస్తరిస్తోందని, అధ్యాపకులు, పరిశోధకులు, వైద్య నిపుణులు ఎఐ ఆధారిత సాధనాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

శాస్త్రీయ ఆధారాల అన్వేషణ, సమాచార సేకరణ, గణాంకాల విశ్లేషణ, శాస్త్రీయ వ్యాసాలు, పరిశోధనా పత్రాల రూపకల్పనలో ఎఐ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అయితే, ఎఐను పరిశోధకుల ఆలోచనకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వారి పరిశోధనా సామర్థ్యాన్ని పెంపొందించే సహాయక సాధనంగా మాత్రమే వినియోగించాలని అన్నారు.అనంతరం వనరుల నిపుణులు డా. ఆశా బి., డా. అనిమేష్ జైన్ ఎఐ వినియోగం, శాస్త్రీ.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story