Madanapalle: ఎస్పీడీసీఎల్ స్పోర్ట్స్ కౌన్సిల్ నూతన కార్యవర్గం!

Madanapalle: మదనపల్లెలో ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం.

Srinivasulu, Madanapalle
Published on: 10 July 2026 12:38 PM IST
Madanapalle
X

Madanapalle: ఎస్పీడీసీఎల్ స్పోర్ట్స్ కౌన్సిల్ నూతన కార్యవర్గం!

మదనపల్లె: ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గౌరవ ఎస్‌సీ సోమశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా డీఈ (ఆపరేషన్) ఎం. గంగాధర్, ట్రెజరర్‌గా ఎస్‌ఏఓ బ్రహ్మచారి,

స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీగా గురు భాస్కర్, కల్చరల్ సెక్రటరీగా ఆర్.ఎల్. నరసింహారెడ్డి (ఏఈ) ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా ఉమామహేశ్వర్, మహమ్మద్ షరీఫ్, అబ్దుల్, సురేష్ ఎన్నిక కాగా, మహిళా ప్రతినిధులుగా ఎ. భగవతి, బి. అనితలను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలియజేస్తూ, అన్నమయ్య సర్కిల్‌లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story