Chintoor: మొబైల్ వాడకంతో పెరుగుతున్న మోసాలు.. గంజాయి బ్యాచ్‌పై ఏఎస్పీ!

Chintoor: పోలవరం జిల్లా చింతూరులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మహిళల భద్రతపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 15 July 2026 5:09 PM IST
Chintoor
X

Chintoor: మొబైల్ వాడకంతో పెరుగుతున్న మోసాలు.. గంజాయి బ్యాచ్‌పై ఏఎస్పీ!

చింతూరు: మహిళల భద్రత మనందరి బాధ్యత అని చింతూరు ఎ యస్ పి హేమంత్ కుమార్ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మహిళల భద్రత పై ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పి హేమంత్ కుమార్ మాట్లాడారు.మహిళల పై జరుగుతున్న మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మహిళల పై సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల పై స్థానికులకు అవగాహన కల్పించారు.గ్రామ గ్రామాన పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

మొబైల్ వాడకం పెరగడంతో మోసాలు పెరుగుతున్నాయని మహిళలు,యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు.మహిళలు, విద్యార్థినులను ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తే 112 నెంబర్ కు కాల్ చేయాలన్నారు.విద్యార్థినులు శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. .మొబైల్ వాడకం పెరుగడం వల్ల మోసాలు కూడా అంతే స్థాయి లో పెరుగు తున్నాయన్నారు.

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గంజాయి సేవించడం,అక్రమ రవాణా చేయటం,అక్రమ రవాణా చేసే వారికి సహకరించటం వంటివి చేసి జీవితాలు జైలు పాలు చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ లు గోపాలకృష్ణ, కన్నపు రాజు

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story