Madanapalle: చంపేస్తేనే స్పందిస్తారా?..పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం!

Madanapalle: మదనపల్లె వలసపల్లి వద్ద ఉన్న హారిక గ్రానైట్స్ ఫ్యాక్టరీ లీజు వివాదం ముదిరింది.

Srinivasulu, Madanapalle
Published on: 26 July 2026 4:33 PM IST
Madanapalle
X

Madanapalle: చంపేస్తేనే స్పందిస్తారా?..పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం!

మదనపల్లె: మదనపల్లె తమపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇసుమంతైన పట్టించుకోలేదని చంపేస్తేనే స్పందిస్తారా.. అంటూ బాధితులు ఆదివారం ప్రెస్ క్లబ్ లో ఆవేదన వ్యక్తం చేశారు.

వారు తెలిపిన వివరాల మేరకు.. వైయస్సార్ కడప జిల్లాకు చెందిన లక్ష్మీదేవి, శ్రీనివాసులు గత ఎనిమిది నెలల క్రితం వలసపల్లి వద్ద ఉన్న హారిక గ్రానైట్స్ ఫ్యాక్టరీని రెండేళ్లకు దినేష్ వద్ద లీజ్ కు తీసుకున్నారు. లీజు గడువు ఇంకా ఉన్నప్పటికీ దినేష్, కృష్ణ లు ఫ్యాక్టరీని ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ వాపోయారు.

ఈ సందర్భంగా లక్షిదేవి, శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ వ్యాపారం నిమి నిమిత్తం ఊరు గాని ఊరు వచ్చి హారిక గ్రానైట్ ఫ్యాక్టరీ ని రెండేళ్ల లీజుకు తీసుకొని వ్యాపారం నిర్వహిస్తుంటే యజమాని దినేష్, కృష్ణ లు జనసేన నాయకులంమంటూ వందమంది అనుచరులతో తమపై దాడి చేసి చంపేస్తామంటూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు.

తమకు ఇంకా ఏడాదిన్నర కాలం లీజు సమయం ఉన్నా ఖాలీ చేయాలని దాడి చేసి గాయపరిచారన్నారు. జరిగిన దాడి, అన్యాయంపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇసుమంతైనా పట్టించుకోలేదని, సిఐ లేడని వెనక్కి పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో కోటి విలువ చేసే సామాగ్రి ఉందని, అయినా దినేష్, కృష్ణ లు వందమంది అనుచరులతో తమపై దాడికి పాల్పడి, ఫ్యాక్టరీలో కరెంటు ఆఫ్ చేసి, లోనికి అడుగుపెట్టినివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారన్నారు.

పోలీసులు స్పందించి తమకు జరిగిన అన్యాయం పై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు బీరంగి రేవతి వీరికి మద్దతుగా మాట్లాడుతూ మహిళ పై దాడి చేస్తే పోలీసులు స్పందించక పోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా లక్ష్మీదేవి, శ్రీనివాస్ దంపతులకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులు కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story