Karveti Nagaram: శుభ్రత పాటించండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి
Karveti Nagaram: కార్వేటినగరం మండలం డి.ఎం పురం మరియు సురేంద్రనగరం పంచాయతీల్లో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ఆరోగ్య మేళా నిర్వహించారు.
Karveti Nagaram: శుభ్రత పాటించండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి
కార్వేటి నగరం: మండలం లోని డి ఎం పురం, సచివాలయం మరియు సురేంద్రనగరం పంచాయతీ లో అంగన్వాడి పాఠశాల యందు ఆరోగ్య మేళ మరియు అనీమియా పై అవగాహన కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ రోజా రమణి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో
ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడం కోసం తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ, పరిసరాలను శుభ్రంగా చూసుకోవాలని, మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అనీమియా ను అరికట్టడానికి దృఢంగా ఆరోగ్యకరమైన కిషోరి బాలికలు, బాలురులను తీర్చిదిద్దడానికి పాలు, పండ్లు, ఆకుకూరలు గుడ్లు వంటి మొదలగు వాటిని తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో
పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్, CHO రాజేశ్వరి,CRP కాటవరాయన్,CHO /MLHP పవిత్ర,ANM భువనేశ్వరి,VOA నేలవేణి, ఆశ వర్కర్లు :- మోహన, అశ్వని, అంగన్వాడి కార్యకర్తలు :- అమరావతి, వరలక్ష్మి, సరళ, సుధారాణి, లత,విజయ, శాంతి, కిషోరి బాలికలు పాల్గొన్నారు.




