Madanapalle: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలి!

Madanapalle: ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాల దోపిడీపై MEO నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ ఆరోపించారు.

Srinivasulu, Madanapalle
Published on: 14 Aug 2026 4:44 PM IST
Madanapalle
X

Madanapalle: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలి!

మదనపల్లె: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, అనధికారిక వసూళ్లు, యూనిఫామ్‌లు, పుస్తకాలు, స్టేషనరీ విక్రయాల పేరుతో జరుగుతున్న వాణిజ్య దోపిడీపై మండల విద్యాశాఖ అధికారి (MEO) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు.

ఈ అంశంపై PGRS Grievance No: ANMY202607041162 ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ, MEO కార్యాలయం సాంకేతిక కారణాలు చూపుతూ చర్యలకు దూరంగా ఉందని ఆయన అన్నారు. పాఠశాలల్లో అక్రమ వసూళ్లపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడం విచారకరమన్నారు.

కేవలం కోర్టు తీర్పుల పేరుతో పాఠశాలల అక్రమాలను సమర్థించడం సరికాదని పునీత్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడాల్సిన విద్యాశాఖ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

పాఠశాలల్లో యూనిఫామ్‌లు, పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన తరఫున పునీత్ కుమార్ కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story