Chittoor: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బంధువు అరెస్ట్!
Chittoor: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు హరిప్రసాద్‌ను పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.
Chittoor: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బంధువు అరెస్ట్!
చిత్తూర్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని కేవలం 24 గంటల్లోనే అరెస్ట్ చేసిన బంగారుపాళ్యం పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS అభినందించారు.ఈ నెల 17న బంగారుపాళ్యం మండలం అండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఆమెకు సమీప బంధువైన గంగవరం మండలం అరసనపల్లి గ్రామానికి చెందిన హరి అలియాస్ హరి ప్రసాద్ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో, ఆమె తల్లి జూలై 20 రాత్రి బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు క్రైమ్ నెం.112/2026గా BNS సెక్షన్లు 65(1), 75(2), 78(2), 351(2)తో పాటు POCSO చట్టంలోని సెక్షన్ 4 రీడ్ విత్ 3(a) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పలమనేరు SDPO డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి.




