Punganur: టీడీపీ నేతలకు బీసీవై పార్టీ సవాల్.. ఆలయంలో సత్య ప్రమాణం!

Punganur: బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌పై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాలబండ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నేతలు సత్య ప్రమాణం చేశారు.

MAHESH, PUNGANOOR
Published on: 27 May 2026 5:40 PM IST
Punganur
X

Punganur: టీడీపీ నేతలకు బీసీవై పార్టీ సవాల్.. ఆలయంలో సత్య ప్రమాణం!

Punganur: రామచంద్ర యాదవ్ పై కొందరు రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు సమాధానంగా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాల బండలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత వెలసిన ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు మాట్లాడుతూ —

“మా పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కానీ, పార్టీ నాయకులు కానీ ఎలాంటి ఇతర రాజకీయ పార్టీలకు తొత్తులు కాదని, బినామీలు కాదని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాము. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే చర్య” అని పేర్కొన్నారు.

అలాగే బీసీవై పార్టీకి సవాలు విసిరిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలయానికి వచ్చి ప్రమాణం చేయకపోవడం ప్రజలు గమనించారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో టిడిపి, వైసిపి పార్టీలు పరస్పరం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని ప్రజలకు స్పష్టంగా తెలుసునని అన్నారు. బీసీల హక్కులు, యువత భవిష్యత్తు, సామాన్య ప్రజల సమస్యలపై రాజీపడకుండా పోరాడేది బీసీవై పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ పీఏసీ కమిటీ సభ్యులు పాల రమేష్ యాదవ్, పూల ప్రేమ్ కుమార్ (బీసీవై యూత్ కో-కన్వీనర్), పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ హరిబాబు యాదవ్, సురేష్ యాదవ్, కుమ్మర గిరిబాబు, శివకుమార్, వెంకటేష్ యాదవ్, చలపతి, రెడ్డివారి మోహన్, స్వాతి ప్రసాద్,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story