Madanapalle: ప్రముఖ రంగస్థల నటుడు బళ్లారి రాఘవకు ఘన నివాళి!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ప్రముఖ రంగస్థల నటుడు బళ్లారి రాఘవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.
Madanapalle: ప్రముఖ రంగస్థల నటుడు బళ్లారి రాఘవకు ఘన నివాళి!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె తాసిల్దార్ కార్యాలయంలో ప్రముఖ రంగస్థల నటుడు, నాటక సంస్కర్త బళ్లారి రాఘవ జయంతి వేడుకలను రెవెన్యూ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, తెలుగు రంగస్థల కళకు బళ్లారి రాఘవ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
నాటక రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కళ, సంస్కృతి, సామాజిక చైతన్యానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం బళ్లారి రాఘవ జయంతిని నిర్వహించడం ద్వారా ఆయన సేవలను భావితరాలకు పరిచయం చేస్తోందని తెలిపారు. అనంతరం అధికారులు ఆయన ఆశయాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
Next Story




