Chittoor: వివాహ రిసెప్షన్ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Chittoor: బెంగళూరులో జరిగిన జయవర్ధన్ రెడ్డి, శ్రావ్యా రెడ్డిల వివాహ రిసెప్షన్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Aug 2026 11:13 PM IST
Chittoor
X

Chittoor: వివాహ రిసెప్షన్ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

చిత్తూర్: బెంగళూరులోని వీరడెన్సీ రిసార్ట్‌లో చిలకం మధుసూదన్ రెడ్డి గారు – ఛాయావతి గారి కుమారుడు జయవర్ధన్ రెడ్డి, రాజ్యలక్ష్మి – సోమశేఖర్ రెడ్డి గారి కుమార్తె శ్రావ్యా రెడ్డిల వివాహ రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ ఆత్మీయ వివాహ రిసెప్షన్ వేడుకలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆత్మీయంగా ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

జయవర్ధన్ రెడ్డి, శ్రావ్యా రెడ్డి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంతో ఉండాలని మంత్రి గారు ఆకాంక్షించారు.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాలతో సాగాయి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story