Gudipala: గుడిపాల ఎంపీపీగా భారతి ధనసింగ్.. వైస్ ఎంపీపీగా రాణి!

Gudipala: చిత్తూరు జిల్లా గుడిపాల ఎంపీపీగా భారతి ధనసింగ్, వైస్ ఎంపీపీగా జనసేన నేత రాణి గురువారం ఆర్వో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 19 Nov 2026 7:16 PM IST
Gudipala
X

Gudipala: గుడిపాల ఎంపీపీగా భారతి ధనసింగ్.. వైస్ ఎంపీపీగా రాణి!

చిత్తూరు: చిత్తూరు జిల్లా గుడిపాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) భారతి ధనసింగ్, ఉపాధ్యక్షురాలిగా (వైస్ ఎంపీపీ) రాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గుడిపాల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి పెంచల కిషోర్ ఆధ్వర్యంలో వారు పదవీ బాధ్యతలు చేపట్టారు. మరకాల కుప్పం ఎంపీటీసీ సభ్యురాలు భారతి ధనసింగ్... ఎంపీపీగా, నారగల్లు ఎంపీటీసీ సభ్యురాలు, జనసేన పార్టీకి చెందిన రాణి వైస్ ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ, వైస్ ఎంపీపీని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గుడిపాల జడ్పీటీసీ మమత శ్రీ, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి గురజాల చెన్నకేశవ నాయుడు, మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, మాజీ ఎంపీపీలు దీప్తి,గొల్ల హరిప్రసాద్ చౌదరి,అనిల్ పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor