Madanapalle: టీడీపీలో 15 ఏళ్ల రికార్డు.. మహిళా అధ్యక్షురాలిగా భారతి

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె తెలుగుదేశం పార్టీలో సరికొత్త చరిత్ర సృష్టించారు.

Srinivasulu, Madanapalle
Published on: 18 Jun 2026 10:39 AM IST
Madanapalle
X

Madanapalle: టీడీపీలో 15 ఏళ్ల రికార్డు.. మహిళా అధ్యక్షురాలిగా భారతి

మదనపల్లె: తెలుగుదేశం పార్టీలో 15 ఏళ్ల తర్వాత మహిళకు కీలక బాధ్యత దక్కింది. మదనపల్లె టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియమితులయ్యారు. ఆమె నియామకంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా బైగారి భారతి నాయుడు మాట్లాడుతూ, తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.

మహిళలకు పార్టీ కార్యక్రమాల్లో మరింత ప్రాధాన్యత కల్పిస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ అధినేతల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, కార్యకర్తలు, మహిళా నాయకులతో కలిసి పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన పార్టీ అధిష్టానం, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా శక్తిని ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ విజయానికి తనవంతు పాత్ర పోషిస్తానని ఆమె స్పష్టం చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story