Madanapalle: తోగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో బీజేపీ నేతలకు సన్మానం
Madanapalle: తోగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు భువనేశ్వరి సత్య, మోడెం వీరాంజనేయ ప్రసాద్‌లను ఘనంగా సన్మానించారు.
Madanapalle: తోగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో బీజేపీ నేతలకు సన్మానం
మదనపల్లె: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోడెం వీరాంజనేయ ప్రసాద్, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి సత్యలను తోగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి సత్య మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చేనేత కార్మికులు, చేనేత కులస్తులకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బీసీలలోని తోగట వీర క్షత్రియులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తోగట వీర క్షత్రియ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే లేదా మున్సిపల్ చైర్మన్ వంటి పదవులు దక్కే అవకాశం కల్పిస్తే, అభ్యర్థులను గెలిపించుకునే విధంగా తమ వంతు కృషి చేసి పోరాడతానని భువనేశ్వరి సత్య తెలిపారు.
పార్టీ బలోపేతంతో పాటు తోగట వీర క్షత్రియ సామాజిక వర్గ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తోగట వీర క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్‌ఐసీ వెంకటరమణ, వెంకటరత్నం, గంగోత్రి గంగాధర్, మదనపల్లె అర్బన్ ప్రధాన కార్యదర్శి బొమ్మిశెట్టి గోకుల్, నాయకులు పురాణం చంద్రశేఖర్,
మోడెం సిద్ధప్ప, ఆర్. నీలకంఠ, ఉప్పు రామచంద్ర, బండి నాగరాజు, ఎస్వీ రమణ, మండపల్లి రమణ, ఆర్. ఆంజనేయులు, ఆర్. రత్నమయ్య, శివయ్య, మోడెం నాగరాజు, కుర్ర వెంకటరమణ, చిట్టెం రామచంద్ర, మల్లికార్జున, ఆనంద, కమల, కృష్ణ, బీజేపీ వెంకటేష్, సుబ్బయ్య, శ్రీరామ్ చిన్నబాబు, పురం సహదేవ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




