Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు!
Srikalahasti: శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు. హాజరైన ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.
Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు!
Srikalahasti: శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. తొమ్మిదవ రోజు వల్లభ గణపతి స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు.
మేళతాళాలు, భాజా భజంత్రీలు, టపాకాయల మోతల నడుమ గణనాథుని నిమజ్జన ఊరేగింపు కన్నులపండువగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.
ఈ నిమజ్జన కార్యక్రమానికి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు కోలా విశాలాక్ష్మి ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు చలువ గొడుగులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. బేరివారి మండపం వద్ద కోలా ఆనంద్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు గణనాథుని వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. నిమజ్జన కార్యక్రమానికి తనను ఆహ్వానించి, ఒక భక్తుడిగా స్వామివారికి సేవలందించే అవకాశం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




