Chowdepalle: భక్తులతో పోటెత్తిన శ్రీ బోయకొండ గంగమ్మ శక్తి క్షేత్రం!
Chowdepalle: ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా బోయకొండ గంగమ్మ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. ఏపీ, కర్ణాటక, తమిళనాడుల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం.
Chowdepalle: భక్తులతో పోటెత్తిన శ్రీ బోయకొండ గంగమ్మ శక్తి క్షేత్రం!
చౌడేపల్లి: భక్తులతో పోటెత్తిన శ్రీ బోయకొండ గంగమ్మ శక్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజుల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ క్షేత్రం ఆదివారం భక్తులతో పోటెత్తింది.
ఆషాడ మాసం మూడవ ఆదివారం కావడంతో కర్ణాటక తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది వాహనాలలో తరలివచ్చారు.
ఉదయమే అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో అలంకరించిన ఆలయ పూజారులు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మంత్రముగ్ధులయ్యారు బోయకొండ భక్తులతో రద్దీ అధికమవడంతో క్యూ లైన్ లలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు తో నిండిపోయింది ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.
భక్తులు వాహనాలను రోడ్లపై నిలిపివేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది చౌడేపల్లి ఎస్సై చిన్న రెడ్డప్ప సిబ్బందితో కలిసి క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను కొనసాగించారు. కొండపైకి పోయే దారి నుండి కొండ వరకు వాహనాలు నిలిచిపోయాయి రద్దీ అధికంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.




