Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా రాహుకాల అభిషేకం!

Boyakonda: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ.

MAHESH, PUNGANOOR
Published on: 10 July 2026 4:50 PM IST
Boyakonda
X

Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా రాహుకాల అభిషేకం!

Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా అభిషేకం ప్రత్యేక పూజలు

శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మకు రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు ఉదయాన్నే వేద పండితులు అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అభిషేకము నిర్వహించి ప్రత్యేక అలంకరం చేసి అనంతరం రాహుకాల సమయంలో ఉభయ దారుల సమక్షంలో అమ్మవారికి అభిషేకం జరిగింది.

మధ్యాహ్నం వరకు భక్తులు వేచి ఉండి మరి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు పాత కళ్యాణ కట్ట వద్ద అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు దేవస్థానం వారు ఉచిత అన్న ప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రానికి పలమనేరు చెందిన నవీన్ అతని మిత్ర బృందం కూరగాయలను విరాళంగా అందించారు ఆలయ అధికార అర్చక సిబ్బంది భక్తులకు సేవలు అందించారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story