Ramapuram: ఈజీ మనీ కోసం గంజాయి దందా.. బీటెక్ విద్యార్థి అరెస్ట్
Ramapuram: అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న బీటెక్ విద్యార్థి కమలాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Ramapuram: ఈజీ మనీ కోసం గంజాయి దందా.. బీటెక్ విద్యార్థి అరెస్ట్
Ramapuram: అన్నమయ్య జిల్లా రామాపురం లో చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం అలవాటుపడి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న బీటెక్ విద్యార్థి కమలాకర్ రెడ్డి (26) ని పోలీసులు అరెస్టు చేశారు. రామాపురం మండలం కుమ్మరపల్లి సమీపంలోని గ్రీన్ పార్క్ హోటల్ వద్ద కమలాకర్ రెడ్డి ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే గంజాయి,
తోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. నిందితుడు అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గరుగుపల్లి కు చెందిన కమలాకర్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి అక్కడ ఓ పీజీ సెంటర్ లో ఉంటూ వచ్చాడన్నారు.
చెడు వ్యసనాలకు బానిసైన కమలాకర్ రెడ్డి ఈజీ మనీ కి అలవాటు పడి గంజాయి విక్రయించేవాడు అన్నారు. వైజాగ్ నుంచి బెంగళూరుకు గంజాయి సరఫరా చేసి అక్కడ నుంచి పోర్టర్ యాప్ ద్వారా బెంగళూరులో ఉండే యువతకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.




