Madanapalle: కలుషిత నీటి సరఫరాపై బాబు కాలనీ వాసుల ఆందోళన!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె బాబు కాలనీలో కులాయిల ద్వారా మంచినీటికి బదులుగా కాలవ నీరు వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 5 Aug 2026 9:44 AM IST
Madanapalle
X

Madanapalle: కలుషిత నీటి సరఫరాపై బాబు కాలనీ వాసుల ఆందోళన!

Madanapalle: మదనపల్లె పట్టణంలోని బాబు కాలనీలో కులాయిల ద్వారా మంచినీటికి బదులుగా కాలవ నీరు వస్తోందని కాలనీవాసులతో పాటు స్థానిక నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు రావడంతో తాగునీటితో పాటు నిత్యావసర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ సమస్యను పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని కాలనీవాసులు, నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, బాబు కాలనీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు, స్థానిక నాయకులు విజ్ఞప్తి చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story