Chowdepalli: బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో చండీహోమం
Chowdepalli: చౌడేపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహణ. ఈవో ఏకాంబరం తీర్థప్రసాదాల పంపిణీ.
Chowdepalli: బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో చండీహోమం
చౌడేపల్లి: ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో సోమవారం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని చండీహోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చండీహోమంలో దంపతులు పాల్గొని తమ అభీష్ట సిద్ధి, కుటుంబ సుఖసంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.
అనంతరం దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి జె. ఏకాంబరం దంపతులకు బోయకొండ గంగమ్మ అమ్మవారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారి కృపతో భక్తుల కోర్కెలు నెరవేరాలని, సకల శుభాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.




