Chandragiri: చంద్రగిరిలో దేవా రైస్ మిల్లు అక్రమాలు.. రైతుల ఆగ్రహం

Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి రాయలపురం వద్ద గల దేవా రైస్ మిల్లు యాజమాన్యం రైతులను దోచుకుంటోందని బాధితులు ఆరోపిస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 13 Jun 2026 7:16 PM IST
Chandragiri
X

Chandragiri: చంద్రగిరిలో దేవా రైస్ మిల్లు అక్రమాలు.. రైతుల ఆగ్రహం

Chandragiri: చంద్రగిరిలో రైతులను దోచుకుంటున్న రైస్ మిల్ యాజమాన్యం. రైతులు పండించిన వరి ధాన్యాన్ని బియ్యం గా మార్చుకునేందుకు రైస్ మిల్ వద్దకు వెళుతుంటారు. ఇదే అదునుగా చంద్రగిరిలో రాయల్ పురం వద్ద ఉన్న దేవా రైస్ మిల్ దోచుకుంటున్న పరిస్థితి.

ప్రశ్నించిన రైతులపై దురుసు ప్రవర్తనకు పాల్పడుతున్న రైస్ మిల్ యాజమాన్యం. పగలనక రాత్రనక కష్టపడి పండించిన పంటను ఒక వైపు దళారులు మరోవైపు రైస్ మిల్ యాజమాన్యం దోచుకుంటున్నారని వాపోతున్న రైతులు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్న రైతులు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story