Chandragiri: జీవో 396 రద్దు చేయాలి దస్తావేజు లేఖరుల పెన్ డౌన్!

Chandragiri: జీవో నెం. 396 ను రద్దు చేయాలని చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరుల నిరసన. నెలాఖరు వరకు పెన్ డౌన్‌కు పిలుపునిచ్చిన సంఘం.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 21 July 2026 6:40 AM IST
Chandragiri
X

Chandragiri: జీవో 396 రద్దు చేయాలి దస్తావేజు లేఖరుల పెన్ డౌన్!

Chandragiri: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జి.ఓ. నెం 396ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు నిరసన తెలిపారు. చంద్రగిరి దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గోపి మాట్లాడుతూ,నూతన జీవో వలన ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న అనేక కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రైవేటు సంస్థలకు దస్తావేజులు తయారు చేసే పనిని అప్పగించడం వలన ప్రజల ఆస్తుల భద్రతపై కూడా ప్రభావం పడి రిజిస్ట్రేషన్ శాఖలో ఇప్పటివరకు కొనసాగుతున్న అష్యూరెన్స్ అనగా ఆస్తులకు భద్రత అనే అంశము ఈ జీవోతో పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉందన్నారు.

సోమవారం నుంచి నెలాఖరు వరకు చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమానికి ప్రజలు తమ సహకారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ పక్రియను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆస్తులకు భద్రత ఉండదని తెలిపారు.

తద్వారా అనేక న్యాయపరమైన సమస్యలు వస్తాయని ఆయన చెప్పారు. ఆర్ ఎస్ కె కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం వలన లక్షకుపైగా దస్తావేజు లేఖరుల, స్టాంప్ వేండర్లు, ఆపరేటర్ల కుటుంబాలు వీధిన పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్స్, ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story