Chandragiri: చంద్రగిరి కోదండ రామాలయంలో వైభవంగా 'మహాలక్ష్మి దీప పూజ'

Chandragiri: చంద్రగిరిలోని ప్రసిద్ధ శ్రీ కోదండరామాలయంలో 'శ్రీ మహాలక్ష్మి దీప పూజ' మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 11 July 2026 7:05 AM IST
Chandragiri
X

Chandragiri: చంద్రగిరి కోదండ రామాలయంలో వైభవంగా 'మహాలక్ష్మి దీప పూజ'

చంద్రగిరి: స్థానిక ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీ కోదండరామాలయంలో భక్తులు 'శ్రీ మహాలక్ష్మి దీప పూజ' మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ శుక్రవారం రాత్రి అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. చంద్రగిరి శాసనసభ్యులు (ఎమ్మెల్యే) పులివర్తి నాని గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి మహిళా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని - సుధారెడ్డి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయస్వామి వారికి ఎమ్మెల్యే నాని దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్క మహిళ నిండు సుమంగళిగా వర్ధిల్లాలనే సత్సంకల్పంతో ఈ దీప పూజను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 2,000 మంది మహిళలతో అత్యంత వైభవంగా సాగుతున్న ఈ దీప పూజా మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికార వర్గాలు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story