Pakala: పాకాలలో మానవత్వం చాటుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి!

Pakala: తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యటన.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 19 Jun 2026 9:47 PM IST
Pakala
X

Pakala: పాకాలలో మానవత్వం చాటుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి!

Pakala: కష్టకాలంలో ఉన్న నిరుపేద కుటుంబాలు, పార్టీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని (వెంకటమణి ప్రసాద్) తెలిపారు.

పాకాల మండలం మొగరాల పంచాయతీకి చెందిన అర శ్రీవాణి మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి రూ.3 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా శ్రీవాణి నివాసానికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, శ్రీవాణి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ అవసరాలను అడిగి తెలుసుకున్నారు.ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిన ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని శ్రీవాణి కుటుంబ సభ్యులు తెలిపారు.తమ సమస్యను గుర్తించి సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు ఇంటి వద్దకే వచ్చి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story