Chintoor: చింతూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కారం నవ్య నామినేషన్!
Chintoor: చింతూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతు అభ్యర్థిగా కారం నవ్య శుక్రవారం మండల నాయకుల సమక్షంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Chintoor: చింతూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కారం నవ్య నామినేషన్!
చింతూరు: చింతూరు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతు అభ్యర్థిగా కారం నవ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.మండల కన్వీనర్ వై. రామలింగారెడ్డి, సుధాకర్ (చిన్ని), కోట్ల కృష్ణ దగ్గరుండి నామినేషన్ పత్రాలను అధికారులకు అందించారు. నామినేషన్ సందర్భంగా చింతూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది.
మహిళా అభ్యర్థిగా నవ్య బరిలోకి దిగడంతో మహిళా ఓటర్లలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. నామినేషన్ అనంతరం మాట్లాడిన నవ్య... చింతూరు అభివృద్ధే తన లక్ష్యమని, తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇచ్చారు.మరోవైపు నామినేషన్ దశలోనే వైఎస్ఆర్సీపీ తన బలాన్ని చాటుకుందని, ఈ ఎన్నికలో నవ్య విజయం ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.




