Chittoor: చిత్తూరులో ఘనంగా 'నషా ముక్త్ భారత్ అభియాన్' ర్యాలీ

Chittoor: చిత్తూరు అపోలో నాలెడ్జ్ సిటీలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' కింద డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 24 July 2026 8:37 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో ఘనంగా 'నషా ముక్త్ భారత్ అభియాన్' ర్యాలీ

Chittoor: యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని అపోలో యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డా. నితిన్‌ ఎం. నాగర్కర్‌ పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు "నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌"లో భాగంగా అపోలో నాలెడ్జ్‌ సిటీలో విద్యార్థి వ్యవహారాల విభాగం, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మత్తు వ్యతిరేక అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు.

వైస్‌ చాన్సలర్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వ్యసనం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

ప్రధాన అతిథి చిత్తూరు ట్రాఫిక్‌ సీఐ జి. నిత్యబాబు మాట్లాడుతూ డ్రగ్స్‌ వినియోగం యువతను నేరాల బారిన పడేలా చేస్తుందని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story