Chittoor: యాంటీబయాటిక్స్ వాడకంలో జాగ్రత్తలు పాటించాలి: డాక్టర్ కిషోర్!
Chittoor: చిత్తూరు అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్‌నెస్ వీక్–2026 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.
Chittoor: యాంటీబయాటిక్స్ వాడకంలో జాగ్రత్తలు పాటించాలి: డాక్టర్ కిషోర్!
చిత్తూరు: యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచనల మేరకే వినియోగించాలని, ఇష్టానుసారంగా మందులు వాడటం వల్ల యాంటీమైక్రోబియల్ నిరోధకత (ఏఎంఆర్) పెరిగే ప్రమాదం ఉందని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఏ. కిషోర్ సూచించారు.
ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్‌నెస్ వీక్-2026 సందర్భంగా ఎఐఎంఎస్‌ఆర్ మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా క్విజ్, క్రాస్‌వర్డ్ పజిల్, గేమిఫికేషన్, రంగోలి పోటీలు నిర్వహించి విద్యార్థులకు ఏఎంఆర్‌పై అవగాహన కల్పించారు.
గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ వారోత్సవాల నివేదికను వివరించారు. అనంతరం డాక్టర్ సృష్టి తనేజా ఆధ్వర్యంలో విద్యార్థులతో యాంటీమైక్రోబియల్ స్టీవార్డ్‌షిప్ ప్రతిజ్ఞ చేయించారు. వివిధ పోటీల్లో విజేతలకు ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రమ్య బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.




