Chittoor: అపోలోలో మాలిక్యులర్ బయాలజీపై వర్క్‌షాప్!

Chittoor: చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీలో మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్‌పై ప్రాక్టికల్ వర్క్‌షాప్: వైద్య పరిశోధనలో నైపుణ్యాలే కీలకమని డీన్ డా. రమ్యా రామకృష్ణన్ వెల్లడి.

Chandra Sekhar, Chittoor
Published on: 24 Sept 2026 4:23 PM IST
Chittoor
X

Chittoor: అపోలోలో మాలిక్యులర్ బయాలజీపై వర్క్‌షాప్!

చిత్తూరు: వైద్య పరిశోధన రంగంలో ఆధునిక మాలిక్యులర్ బయాలజీ సాంకేతికతలపై ప్రాక్టికల్ పరిజ్ఞానం ఎంతో కీలకమని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎఐఎంఎస్‌ఆర్) డీన్ డా. రమ్యా రామకృష్ణన్ పేర్కొన్నారు. ఎఐఎంఎస్‌ఆర్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బయోకెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్‌పై ప్రాక్టికల్ వర్క్‌షాప్ నిర్వహించారు.

వైద్య విద్యార్థులు, పరిశోధకులకు ఆధునిక ప్రయోగాత్మక నైపుణ్యాలను అందించడంతో పాటు, పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారికి వివిధ మాలిక్యులర్ బయాలజీ సాంకేతికతలపై ప్రత్యక్ష శిక్షణ అందించారు.

ముఖ్యంగా డీఎన్‌ఏ ఐసోలేషన్, డీఎన్‌ఏ క్వాంటిఫికేషన్, మైక్రోస్కోపీ, ఇమేజ్ అనాలిసిస్, క్రోమోజోమ్ విజువలైజేషన్, క్యారియోటైపింగ్ తదితర అంశాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. అలాగే రక్తం లేదా ఇతర జీవ నమూనాల్లోని ప్రోటీన్లను గుర్తించే వివిధ పరీక్షా పద్ధతులపై కూడా శిక్షణ ఇచ్చారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor