Chittoor: న్యాయం గెలిచింది పూతలపట్టు టిడిపి నేతలకు ఊరట!
Chittoor: వైసీపీ హయాంలో పూతలపట్టు టిడిపి నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను చిత్తూరు కోర్టు కొట్టివేసింది. దొరబాబు చౌదరి హర్షం.
Chittoor: న్యాయం గెలిచింది పూతలపట్టు టిడిపి నేతలకు ఊరట!
Chittoor: పూతలపట్టు మండలం తెలుగుదేశం పార్టీ నాయకుల పై వైసీపీ నేతలు పెట్టిన తప్పుడు కేసులను చిత్తూరు న్యాయస్థానం కొట్టి వేసింది. వివరాలు ఇలా ఉన్నాయి వైయస్సార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొరబాబు చౌదరి ఆధ్వర్యంలో 2021 సెప్టెంబర్ మాసంలో పూతలపట్టు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం జరిగింది. దీనిపై వైసీపీ నేతలు దొరబాబు చౌదరి తో పాటు మరో 21 మందిపై తప్పుడు కేసులు బనాయించారు.
దీంతో పోలీసులు వీరుపై కేసు నమోదు చేసి కోర్టులో కేసు వేశారు. ఈ కేసు గురువారం చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న మూడవ కోర్టులో వాయిదా ఉండగా పూర్వపరాలు పరిశీలించిన అనంతరం వీరిపై నేరం రుజువు కాకపోవడంతో న్యాయమూర్తి ఈ కేసును కొట్టివేశారు. ఇది ఇలా ఉండగా 2021 అక్టోబర్ నెలలో పూతలపట్టు మండలంలోని అయ్యప్ప గారి పల్లి గ్రామంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను టిడిపి నేతలు శవ యాత్ర నిర్వహించారని దీనిపై వైసీపీ నేతల ప్రోత్బలంతో పోలీసులు 11 మంది టిడిపి నేతలపై కేసు నమోదు చేశారు.
ఈ కేసు గురువారం మూడవ కోర్టులో వాయిదా ఉండగా పూర్వపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కాకపోవడంతో ఈ కేసును న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ రెండు కేసులను ఏపీపి ఉమాదేవి వాదించారు.




