Chittoor: చిత్తూరు: ఏడీ వినోద్ సరెండర్‌పై దివ్యాంగుల హర్షం

Chittoor: నిధుల దుర్వినియోగానికి పాల్పడిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయడంపై దివ్యాంగుల జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 17 Sept 2026 4:47 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు: ఏడీ వినోద్ సరెండర్‌పై దివ్యాంగుల హర్షం

చిత్తూరు: నిధులను దారి మళ్ళించి అక్రమాలకు, అవినీతికి పాల్పడిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి వినోద్ ను ప్రభుత్వానికి సరెండర్ చేసినందుకు దివ్యాంగుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు కొణతల చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి కృతజ్ఞతలు తెలియజేశారు.

గురువారం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో పసుపు నీళ్లు తల్లి పుణ్యాహవచనం చేసి, అవినీతి మరకలు తొలగిపోవాలని శుద్ధిచేసి కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి ప్రవేశించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోటి రూపాయలు జిల్లాలోని దివ్యాంగులకు అందవలసిన వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను దారి మళ్ళించి అక్రమంగా అవినీతికి పాల్పడుతూ తన ఖాతాలోకి మళ్లించుకున్నారని ఆరోపించారు.

ఇదే విషయంపైన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఫిర్యాదు చేయడంతో పాటు, పలుమార్లు కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ఇందులో భాగంగా విచారణ అధికారిగా సురేష్ ను, జెసి రాజేంద్ర ను నియమించి కాలయాపన లేకుండా అతనిని మాతృ శాఖకు సరైన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor