Chittoor: బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా - రావూరి వెంకటస్వామి

Chittoor: చిత్తూరులో విద్యావేత్త రావూరి వెంకటస్వామి ప్రెస్ మీట్. బీజేపీ బలోపేతానికి, స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేస్తానని వెల్లడి.

Chandra Sekhar, Chittoor
Published on: 25 Sept 2026 6:44 PM IST
Chittoor
X

Chittoor: బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా - రావూరి వెంకటస్వామి

చిత్తూరు: బీజేపీ బలోపేతానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రముఖ విద్యావేత్త, శ్రీనివాస ఎడ్యుకేషనల్ అకాడమీ అధినేత రావూరి వెంకటస్వామి తెలిపారు.

ఇటీవల విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన.. శుక్రవారం చిత్తూరులో తొలిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, పోలవరం, అమరావతి, జాతీయ రహదారులు, రైల్వే తదితర రంగాల్లో కేంద్రం మద్దతు అందిస్తోందని చెప్పారు.

రాష్ట్రంలో పీవీఎన్‌ మాధవ్‌ నాయకత్వంలో బీజేపీ బలోపేతం అవుతోందన్నారు.గతంలో కాంగ్రెస్‌ తరఫున చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.ఈ అనుభవాన్ని పార్టీ బలోపేతానికి వినియోగిస్తానన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor