Chittoor: స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి!
Chittoor: చిత్తూరులో ఆర్థిక లావాదేవీల వివాదంతో ఇద్దరు స్నేహితులు కత్తులతో దాడి చేసుకున్నారు; తీవ్రంగా గాయపడిన చిట్టిబాబు స్విమ్స్ తరలింపు.
Chittoor: స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి!
Chittoor: స్నేహితుల మధ్య గొడవ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న స్నేహితులు. చిత్తూరు నగరంలోని పెద్ద కొత్తూరుకు చెందిన చిట్టిబాబు, తేనబండ కు చెందిన శంకర్ లు మెకానికల్గా పనిచేస్తున్నారు. వారి మధ్య ఏర్పడిన ఆర్థిక లావాదేవీల వివాదం గాలివానై ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు ,చిత్తూరు కొత్త బస్టాండ్ సమీపంలోని కట్టమంచి చెరువు వద్ద ఇద్దరు ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయింది.108 కు సమాచారం అందించటంతో ఇరువురిని చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించి, చిట్టిబాబు పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో స్విమ్స్ కి తరలించారు.చిత్తూరు వన్ టౌన్ సీఐ చిన్నపెద్దయ్య సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




