Chittoor: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రోజుల శిశువు మృతి
Chittoor: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రోజుల మగ శిశువు మృతి; కారణాలపై స్పష్టత, సమగ్ర విచారణ కోరుతూ కుటుంబ సభ్యుల ఆందోళన.
Chittoor: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రోజుల శిశువు మృతి
చిత్తూరు: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుడిపాల మండలం 189 రామాపురానికి చెందిన సలోమి, క్రిస్టిన్ దంపతులకు జన్మించిన మగ శిశువు నాలుగు రోజులకే మృతి చెందాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బిడ్డ బుధవారం ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్నాడని, సాయంత్రానికి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
శిశువు మృతికి గల కారణాలను వివరించాలని, అందించిన వైద్యంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తూ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే నిర్లక్ష్య ఆరోపణలపై అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది.




