Chittoor: అంతర్‌రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ - రూ.9 లక్షల బంగారం స్వాధీనం
Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరులో అంతర్‌రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్. నిందితుల నుంచి రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Chittoor: అంతర్‌రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ - రూ.9 లక్షల బంగారం స్వాధీనం
చిత్తూరు: చిత్తూరు జిల్లా పెనుమూరు పోలీసులు అంతర్‌రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, మూడు చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించారు. వారి నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పెనుమూరు, జి.డి. నెల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలపై ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, మానవ నిఘా ద్వారా దర్యాప్తు చేపట్టాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 25న పెనుమూరు మండలం కొత్త రోడ్డు సమీపంలో నిందితులు ఎం. మురుగన్ @ రాము (52), కె. బాబు (43)లను అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు మురుగన్‌పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే 16 ఆస్తి సంబంధిత నేరాల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నిర్మానుష్య ప్రాంతాలు, గ్రామీణ రహదారులు, తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.కేసులను ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్




