Chittoor: చిత్తూరులో జైన్ సంఘం ఉచిత కంటి వైద్య శిబిరం!
Chittoor: చిత్తూరు రాములు గుడి వీధిలో జైన్ సంఘం ఉచిత కంటి వైద్య శిబిరం: అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులచే పరీక్షలు, ఎంపికైన రోగులకు ఉచిత శస్త్రచికిత్సలు.
Chittoor: చిత్తూరులో జైన్ సంఘం ఉచిత కంటి వైద్య శిబిరం!
చిత్తూరు: చిత్తూరు నగరంలోని జైన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాములు గుడి వీధిలోని జైన్ సంఘం ప్రార్థన మందిరంలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జై సంగం వ్యవస్థాపకులు సుభాష్ జైన్ మాట్లాడుతూ ప్రతి నెల 4వ ఆదివారం ఇక్కడ పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని.
అందులో భాగంగా ఈరోజు జరిగిన కంటి పరీక్షల శిబిరంలో తిరుపతికి చెందిన అరవింద్ కంటీ హాస్పిటల్ డాక్టర్ల బృందం సే పరీక్షలు నిర్వహించగా అందులో ఎంపికైన వారికి ఆపరేషన్ చేసి వారికి అన్ని వసతులు కల్పించి తిరిగి తీసుకువచ్చే బాధ్యత జైన్ సంఘం తీసుకుంటుందని తెలిపారు.




