Chittoor: కట్టమంచి చెరువులో వినాయక నిమజ్జన వేడుకల కోసం జలహారతి

Chittoor: చిత్తూరు కట్టమంచి చెరువులో వినాయక నిమజ్జన వేడుకల కోసం జలహారతి. పంచగవ్యంతో నీటి శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీ.

Chandra Sekhar, Chittoor
Published on: 12 Sept 2026 4:40 PM IST
Chittoor
X

Chittoor: కట్టమంచి చెరువులో వినాయక నిమజ్జన వేడుకల కోసం జలహారతి

చిత్తూరు: చిత్తూరు నగరం కట్టమంచి చెరువులో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్థానిక కట్టమంచి చెరువులో పరిశుద్ధమైన నీటిని అందులో నింపి జలహారతి నిర్వహించారు.

ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ చే కలస స్థాపన చేసిప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం నీటిని పంచగవ్యం తో శుద్ధి చేసి కర్పూర హారతులతో నీరాజనాలను పలికారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తోట పాలెం వెంకటేష్,రామ్ భద్ర, గోళ హరిప్రసాద్, చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాస్, సురేష్, పద్మనాభ నాయుడు, పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor