Chittoor: చిత్తూరు మేయర్ పదవి బీసీ జనరల్.. సీకే బాబు కుటుంబానికి ఇవ్వొద్దు

Chittoor: చిత్తూరు మున్సిపల్ మేయర్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించడంతో సీకే బాబు కుటుంబానికి ఇవ్వొద్దని, బలిజ లేదా ఇతర బీసీలకు ఇవ్వాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 12 Oct 2026 7:00 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు మేయర్ పదవి బీసీ జనరల్.. సీకే బాబు కుటుంబానికి ఇవ్వొద్దు

చిత్తూరు: మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించడంతో నగరంలో రాజకీయ వేడి పెరిగింది. సీకే బాబు కుటుంబానికి మేయర్‌ పదవి ఇవ్వొద్దని బలిజ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీసీ వర్గాలకు చెందిన కటారి హేమలత లేదా కాజూరు బాలాజీ సతీమణికి అవకాశం కల్పించాలని కోరారు.

గతంలో సీకే బాబు, ఆయన అనుచరుల వల్ల బలిజ సంఘం నాయకులు నష్టపోయారని, నగరం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని విమర్శించారు. సీకే బాబు కుటుంబానికి మేయర్‌ పదవి ఇస్తే జిల్లా వ్యాప్తంగా బలిజలు ఓటు వేయడానికి నిరాకరిస్తారని హెచ్చరించారు.

బలిజలు, బీసీ నాయకర్లు, మొదలియార్లు, వడ్డెర్లకు పదవి ఇస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓఎం రామదాసు, యశ్వంత్‌, పూల చందు, రెడ్డిగుంట కిషోర్‌, తులసి తదితరులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor