Chittoor: చిత్తూరులో మెగా ఉచిత వైద్య శిబిరం.. 500 మందికి పరీక్షలు
Chittoor: చిత్తూరు నగరంలో శ్రీ లోచన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత ఆరోగ్య శిబిరం. వైదేహి ఆసుపత్రి సహకారంతో 500 మందికి వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ.
Chittoor: చిత్తూరులో మెగా ఉచిత వైద్య శిబిరం.. 500 మందికి పరీక్షలు
చిత్తూరు: చిత్తూరు నగర ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ లోచన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో, బెంగళూరుకు చెందిన వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సహకారంతో ఆదివారం మెగా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు.
నగరంలోని ఆదర్శ విద్యామందిర్ స్కూల్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో గుండె, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్‌టీ,ఆర్థోపెడిక్స్, యూరాలజీ,జనరల్ మెడిసిన్ తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు.
అవసరమైన వారికి ఈసీజీ (ECG), ఈకో (2D Echo), రక్తపోటు, రక్తంలో చక్కెర పరీక్షలు, పాప్ స్మియర్ వంటి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. శిబిరానికి విశేష స్పందన లభించగా, సుమారు 500 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ




