Chittoor: చిత్తూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Chittoor: చిత్తూరులో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. విజన్ 2047 లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడి.

Chandra Sekhar, Chittoor
Published on: 15 Aug 2026 10:44 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చిత్తూర్: విజన్ 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. 80 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మంత్రి సత్య కుమార్ చిత్తూరులో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఇందుకు అనుగుణంగా తగిన ప్రణాళికల రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాను పర్యాటక అభివృద్ధికి అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

డిజిటల్ సాంకేతిక ఉపయోగించుకుని వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేసి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజన్ 20047లో భాగంగా చేపట్టిన సంజీవిని కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్యవంత సమాజానికి ఇది మైలురాయని ఆయన తెలిపారు.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు రైతులను ఆదుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందేలా సమిష్టి కృషితో అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు సూపర్ సిక్స్ అమలులో కూడా రాష్ట్రం అభివృద్ధి ది

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story