Chittoor: చిత్తూరులో రెడ్ క్రాస్ రక్తదాన కేంద్రం ప్రారంభం

Chittoor: చిత్తూరులో నూతన రెడ్ క్రాస్ రక్తదాన కేంద్రం, జిల్లా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్.

Chandra Sekhar, Chittoor
Published on: 15 Aug 2026 10:34 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో రెడ్ క్రాస్ రక్తదాన కేంద్రం ప్రారంభం

చిత్తూరు: చిత్తూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన కేంద్రం, జిల్లా శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండటం ఎంతో కీలకమని, ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ నూతన భవనం, రక్తదాన కేంద్రం దోహదపడుతుందని తెలిపారు.రక్తదానం పట్ల ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆరోగ్య రంగంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ , జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ , జిల్లా రెడ్ క్రాస్ గౌరవ చైర్మన్ తేజోమూర్తి

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story