Chittoor: చిత్తూరులో 'ది బ్రెయిన్' సినిమా షూటింగ్
Chittoor: చిత్తూరులో సందడి చేసిన 'ది బ్రెయిన్' సినిమా బృందం. హోంశాఖ మంత్రిగా నటిస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్. హీరోగా కాజూరు చరణ్.
Chittoor: చిత్తూరులో 'ది బ్రెయిన్' సినిమా షూటింగ్
చిత్తూరు: ది బ్రెయిన్ సినిమా బృందం చిత్తూరులో సందడి చేసింది ఎల్లూరి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై నిర్మాతగా జయచంద్ర , సహ నిర్మాత ఉమా శంకర్ లు నిర్మిస్తున్న ది బ్రెయిన్ చిత్రంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హోం మినిస్టర్ నటిస్తుండగా తెలుగుదేశం పార్టీ నేత కాజూరు బాలాజీ తనయుడు హీరోగా చరణ్ కోలీవుడ్ నటి దివ్య హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల నివాసంలో సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు, ముఖ్యంగా ఈ చిత్రంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హోంశాఖ మంత్రిగా నటనకు సంబంధించి పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
అలాగే చిత్తూరు మొట్టమొదటిసారిగా హీరోగా కాజూరు బాలాజీ నాయుడు చరణ్ హీరోగా నటిస్తుండడంతో ఆసక్తి రేకెత్తించింది. ఈ చిత్రం మానవ ఆలోచన విధానాల వలన జరిగే పరిణామాలు ప్రతిబింబించే కథాంశంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు.




