Chittoor: చిత్తూరులో ఘనంగా 'మెగా పీటీఎం 4.0'
Chittoor: చిత్తూరు కస్తూరిబా, వరదప్పనాయుడు పాఠశాలల ఆధ్వర్యంలో జరిగిన మెగా పిటిఎంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు.
Chittoor: చిత్తూరులో ఘనంగా 'మెగా పీటీఎం 4.0'
Chittoor: చిత్తూరు నగరంలోని కస్తూరిబా బాలికల నగర పాలకోన్నత పాఠశాల, వరదప్పనాయుడు నగర పాలకోన్నత పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ టిడిపి సీనియర్ నేత కాజూరు బాలాజీ, చూడ చైర్ పర్సన్ కటారి హేమలత మాజీ మేయర్ అముద , మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్,
కార్పొరేటర్ శశికుమార్ ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ జయ ప్రకాష్ నాయుడు, మండల విద్యాశాఖ అధికారులు సెల్వరాజ్ మోహన్ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాను ప్రభ చర్చి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనానికి ప్రహరీ గోడ మరుగుదొడ్ల నిర్మాణానికి సహాయం చేయాలని కోరగా ఎమ్మెల్యే స్పందిస్తూ తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తల్లికి వందనం నగదు పడని వారిని గుర్తించి వారికి వెంటనే పడే విధంగా చర్యలు చేపడతామని ఇంటి స్థలాలు లేని వారికి స్థలాల కేటాయింపుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ఇరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రగతి నివేదికను సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నాణ్యమైన విద్య, వసతులను కల్పిస్తున్నామని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.




