Chittoor: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ఘనంగా రాఖీ కట్టిన ఆడపడుచులు!
Chittoor: రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు మహిళలు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు.
Chittoor: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ఘనంగా రాఖీ కట్టిన ఆడపడుచులు!
చిత్తూరు: రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని శుక్రవారం చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజా దర్బార్ అక్కచెల్లెమ్మలతో కిక్కిరిసింది. వెల్లువెత్తిన ఆత్మీయతతో మహిళలు, తెలుగు దేశం పార్టీ, కూటమి పార్టీల మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారికి రాఖీలు కట్టారు.
అక్క చెల్లెమ్మలు కట్టిన రాఖీలతో ఎమ్మెల్యే గారి రెండు చేతులు నిండిపోయాయి. ఎంతో ఆత్మీయంగా రాఖీలు కట్టిన అక్క చెల్లెమ్మలకు.. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్,సతీమణి కంచెర్ల ప్రతిమ గారు పసుపు,కుంకుమ,చీర, మిఠాయిలు అందించారు. చెల్లెమ్మలను ఆశీర్వదించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
Next Story




