Chittoor: చిత్తూరులో ఘనంగా గురజాల నితీష్ జన్మదిన వేడుకలు!

Chittoor: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి. కేక్ కటింగ్‌లతో పాటు 500 మందికి అన్నదానం నిర్వహించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 15 Nov 2026 5:39 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరులో ఘనంగా గురజాల నితీష్ జన్మదిన వేడుకలు!

చిత్తూరు: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తనయుడు గురజాల నితీష్ జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. బీవీ రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో తండ్రి గురజాల జగన్మోహన్, తాత గురజాల చెన్నకేశవులునాయుడు, తల్లి ప్రతిమ సమక్షంలో నితీష్ కేక్ కట్ చేశారు.

అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కేక్ పంపిణీ చేశారు.స్థానిక మెకానికల్ క్రీడా మైదానంలో క్రీడాకారులు, విద్యార్థుల సమక్షంలోనూ వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట 12వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జి మౌళి రాధాకృష్ణ, 13వ డివిజన్ కార్పొరేటర్ జగ్గా ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

సుమారు 500 మందికి ఏర్పాటు చేసిన అన్నదానాన్ని నితీష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మౌళి రాధాకృష్ణ, జగ్గా మాట్లాడుతూ నితీష్ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి వి. సురేంద్రకుమార్, కార్పొరేటర్ షాహిదా గౌస్ బాషా, టీడీపీ నాయకులు పచ్చప్ప,సుబ్రహ్మణ్యంనాయుడు, దామా లీలావతి, ఉదయ్ కుమార్, నాగలక్ష్మి, ఫైరోజ్ ఖాన్, అక్తర్ భాష, జాఫర్ భాష తదితరులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor