Chittoor: చిత్తూరు నూతన ఆరోగ్య కేంద్రం ప్రారంభం పలు అభివృద్ధి పనులు

Chittoor: చిత్తూరులో రూ.88 లక్షలతో పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే జగన్ మోహన్. 2035 నాటికి చిత్తూరును ట్రాన్సిస్ట్ హబ్‌గా మారుస్తామన్న ఎమ్మెల్యే.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 17 July 2026 2:25 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు నూతన ఆరోగ్య కేంద్రం ప్రారంభం పలు అభివృద్ధి పనులు

చిత్తూర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం పైనా శ్రద్ధ పెడుతున్నామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు.శుక్రవారం కలెక్టర్ సుమిత్ కుమార్,ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి చిత్తూరు నగరపాలక పరిధిలో ప్రశాంత్ నగర్ లోని చంద్రబాబు నాయుడు కాలనీలో రూ.88లక్షలతి నిర్మించిన నూతన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, వివిధ విభాగాలను ప్రారంభించారు.ఆవరణంలో మొక్కను నాటి నీరు పోసారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడారు.ప్రజలు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

త్వరలోనే అందరికీ ఈ-సంజీవిని కార్డులు పంపిణీ చేస్తామని,వీటి ద్వారా ఆరోగ్య డేటా ఆసుపత్రిలో అందుబాటులో ఉంటుందన్నారు. చిత్తూరులో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రానున్న ఏడాది ఎంతో కీలకమైందని,కీలకమైన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.స్థానికంగా స్వర్ణ వార్డు సచివాలయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు . ప్రజల బాగు కోసం, అభివృద్ధి పనులను వేగంగా చేస్తున్న ఎమ్మెల్యే, నాయకులను అభినందించారు.

ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ.కూటమి ప్రభుత్వం,తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని,ప్రజలకు సంక్షేమం అందుతుందన్నారు. ఈసంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.చిత్తూరు నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,నగరం అభివృద్ధి చెందాలన్నా, కంపెనీలు రావాలన్నా రోడ్లు విశాలంగా ఉండాలని, మౌలిక సదుపాయాలు మెరుగ్గాఉండాలని.

అందుకోసమే అనేక అవాంతరాలు ఎదురవుతున్నా నగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఎక్స్ ప్రెస్ హైవే లు అందుబాటులోకి వస్తాయని,తద్వారా కంపెనీలు వస్తాయన్నారు. 2035 నాటికి చెన్నై, బెంగళూరు మహానగరాల మధ్య చిత్తూరు ఒక పెద్ద ట్రాన్సిస్ట్ హబ్ గా మారుతుందన్నారు.నగర అభివృద్ధిలో కలెక్టర్ గారి సహకారం మరువలేనిదన్నారు. అభివృద్ధి పనులు చేస్తున్న సమయంలో కొందరు అనవసర ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం చేస్తుంటారని.

వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.ప్రజలకు మేలు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.చిత్తూరు నగరపాలక పరిధిలో 5వ వార్డు కామేశ్వర్ నగర్ లో రూ.20 లక్షలు,8వ వార్డు మైత్రి నగర్ లో రూ.9.9 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్,స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి నరసింహ ప్రసాద్,మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఎఎస్ మనోహర్,పరిశీలకులు కుమారి,కూటమి నాయకులు అముద,సీకే లావణ్య,అట్లూరి శ్రీనివాసులు,వెంకటేష్ యాదవ్,కాజూరు బాలాజీ, ఈశ్వరరావు,రాము,క్లస్టర్, డివిజన్ ఇన్చార్జులు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story