Chittoor: మురుకంబట్టులో 600 గ్రాముల గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్ట్!

Chittoor: చిత్తూరు మురుకంబట్టులో పోలీసులు తనిఖీలు నిర్వహించి 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారుమాదకద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలుంటాయి

Chandra Sekhar, Chittoor
Published on: 1 Oct 2026 1:18 PM IST
Chittoor
X

Chittoor: మురుకంబట్టులో 600 గ్రాముల గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్ట్!

Chittoor: చిత్తూరు మురుకంబట్టు ప్రాంతంలో పోలీసులు 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, వేలూరుకు చెందిన జై కుమార్, మహమ్మద్ అలీ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. వారి వద్ద గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor