Puthalapattu: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: సీఐ హెచ్చరిక!
Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలో 144 సెక్షన్ విధించినట్లు సీఐ తిమ్మయ్య తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుమికూడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Puthalapattu: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: సీఐ హెచ్చరిక!
పూతలపట్టు: పూతలపట్టు మండల కేంద్రంలో 144 సెక్షన్ విధించినట్లు పూతలపట్టు సీఐ తిమ్మయ్య ప్రజలకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జడ్పిటిసి, ఎంపిటిసి లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిన నిమిత్తం నామినేషన్ కేంద్రాల సమీప ప్రాంతాల వద్ద ప్రజలు గుమి కూడా వద్దని, రోడ్డుపైన ఆటోలు ఉంచి ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదని ఆటో డ్రైవర్లకు సిఐ హెచ్చరించారు.
ఎన్నికల నియమాలను వ్యతిరేకించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.




